KKD: బాలికల ఆరోగ్యంపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని అయినవిల్లి గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్ అన్నారు. అయినవిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం HPV వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ మంగాదేవి మాట్లాడుతూ బాలికలు వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు.