AP: అమరావతిలో ప్లాస్టిల్ పైపుల దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. ఘటనపై డీజీపీ హరీష్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీలతో సీఎం సమీక్షించారు. ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ఘటనకు గల కారణాలను కనిపెట్టాలని సూచించారు. రాజధానిలోని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని, పెట్రోలింగ్ పెంచాలని ఆదేశించారు.