SDPT: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చే పురాతన మంచినీటి బావిని పునరుద్ధరించాలని గ్రామ ప్రతినిధులు కేంద్ర మంత్రి బండి సంజయు కోరారు. ఆదివారం బెజ్జంకి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సందర్భంగా సర్పంచ్ బిగుల్ల మోహన్, ఉప సర్పంచ్ వినీత్ గౌడ్ వినతిపత్రం సమర్పించారు. బావి చుట్టూ కంచె నిర్మాణానికి, మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలన్నారు.