VKB: వరంగల్లో ఈనెల 11న జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కోసం వికారాబాద్ జిల్లా జట్టు ఎంపికలు రేపు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 20 ఏళ్లలోపు పురుషులు, మహిళలు మాత్రమే ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి గల క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం 9951343432 లేదా 6300075229 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.