KNR: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు నిత్యం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల వేళ ‘ఓట్లు వేయకుంటే ఆత్మహత్యే’ నంటూ కుటుంబంతో వీడియో విడుదల చేయడం నుంచి వీణవంక జాతరలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యల వరకు ఆయన ప్రస్థానం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసులో సీఐడీ విచారణ ఎదుర్కోనున్నారు.