TPT: సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో తడ మండలం కొండూరు గ్రామంలో మంగళవారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తడ ఎస్సై కొండప్ప నాయుడు, సూళ్లూరుపేట ఎస్సై అజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం రాజు, శ్రీహరికోట ఎస్సై నాగబాబు సిబ్బందితో కలిసి గ్రామంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.