TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. అయితే.. విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయకూడదని షరతు విధించింది. ఈ ఉత్తర్వులతో ఆయనకు చట్టపరంగా పెద్ద ఉపశమనం లభించింది.