విశాఖ జీవీఎంసీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఉన్న హరేంద్ర ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.