KRNL: పెద్దకడబూరులోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రుక్సానా పర్వీన్ మంగళవారం తెలిపారు. తమ విద్యాలయంలో 6వ తరగతి 40 సీట్లు, ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని, అర్హులైన బాలికలు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.