KMM: ఎర్రుపాలెం మండలం వెంకటాపురం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ‘నవ శకం’ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పరీక్ష సామాగ్రి వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. నవ శకం సంస్థ ఫౌండర్ రమేష్‌ను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.