BHNG: పెండింగ్లో ఉన్న కాళేశ్వరం కాల్వ పనులు వెంటనే పూర్తి చేసి గొలుసు కట్టు చెరువులు నింపాలని రాజాపేట మాజీ సర్పంచ్ వంచ వీరారెడ్డి మంగళవారం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. కాళేశ్వరం 15 ప్యాకేజీలో భాగంగా బేగంపేట, చల్లూరు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం భూమిని సేకరించినప్పటికీ కాల్వ పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు.