NRPT: ధన్వాడ మండలం రామకృష్ణయ్య పల్లి గ్రామంలో మంగళవారం డంపింగ్ యార్డ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పేశారు. ట్రాక్టర్ ముందు టైర్లు పూర్తిగా కాలిపోయాయి. నిప్పంటించిన దుండగులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి కోరారు.