హీరో మంచు మనోజ్ SMలో సరికొత్త ఫొటోతో సందడి చేశాడు. బ్లాక్ అండ్ వైట్ జిమ్ పిక్‌లో ఓవైపు తీవ్రమైన అలసటతో, మరోవైపు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. హెడ్‌ఫోన్స్, క్యాప్ ధరించి, కఠోర వ్యాయామం తర్వాత నేలపై కూర్చున్నట్టు ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై మనోజ్ స్పందిస్తూ.. ‘కంఫర్ట్ జోన్’ వదిలి, 21 రోజుల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపాడు.