బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. టీ20 WC విజేతలతో పాటు ఇతర ఐసీసీ టోర్నమెంట్ విజేతలు, కోచ్‌లను ఆహ్వానించనున్నట్లు BCCI సెక్రటరీ సైకియా వెల్లడించాడు. సీనియర్ పురుషుల జట్టు, 2025లో ట్రోఫీని గెలుచుకున్న సీనియర్ మహిళల జట్టు, అండర్-19 బాలుర, బాలికల జట్లు రానున్నట్లు తెలిపాడు. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలనూ సన్మానించనున్నట్లు పేర్కొన్నాడు.