IPL 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టోర్నమెంట్ తొలి 20 రోజుల షెడ్యూల్ను ఈనెల 12లోగా విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్ను విడుదల చేస్తామని తెలిపాడు. కాగా, ఈనెల 28 నుంచి మే 31 వరకు IPL 2026 జరగనుంది.