VZM: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.