E.G: దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం HPV టీకా కార్యక్రమాన్ని ఎంపీపీ కె.వి.కె.దుర్గారావు ప్రారంభించారు. స్త్రీలలో క్యాన్సర్ రాకుండా ఈ వాక్సిన్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. 14ఏళ్లు దాటిన బాలికలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ Ch.నాగార్జునరావు, వైద్యాధికారి డాక్టర్ డి.సంజీవ్ కుమార్ ఉన్నారు.