BHPL: మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామ శివారులోని చలివాగులో పర్మిషన్ లేకుండా ఇష్టారాజంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని CPI (ML) జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, చలివాగు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని తెలిపారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.