టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగుతుండగా ఇటీవల టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రింకూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘మీరు లేకుండా నా జీవితం ఇకపై ఎలా ఉంటుందో తెలియడం లేదు. మీ కల సాకారం చేయడం కోసమే మైదానంలోకి దిగాను. మీ కల నెరవేరింది. మీరు ఇప్పుడు నాతోపాటు ఉంటే బాగుండేది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా నాన్నా’ అంటూ పేర్కొన్నాడు.