అన్నమయ్య: వాల్మీకిపురం మండలంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విఠలం గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి ట్రాక్టర్ను పొలం వద్దకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, హైవేపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.