KMR: జిల్లా కేంద్రంలో శుక్రవారం ‘సీఎం కప్ – 2026’ క్రీడల గోడ పత్రికను ఆవిష్కరించి, భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.