ATP: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కొరత ఏర్పడుతుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. సింగిల్ సిలిండర్ వారు 21 రోజులు, డబుల్ సిలిండర్ వారు 30 రోజుల వ్యవధిలోనే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.