TG: సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందని కథనాలు వస్తున్నాయని.. తమ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అనవసరమైన తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ‘మీకు మీకు ఉన్న పంచాయతీల్లోకి మమ్మల్ని లాగొద్దు’ అన్నారు. తమ మంత్రులను బద్నాం చేసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ఇలాంటి కథనాలు రాసేముందు తమను వివరణ అడగండని సూచించారు.