CTR: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముందస్తు జన్మదిన వేడుకలు రాత్రి బెంగళూరులో ఘనంగా జరిగాయి. గుడిపాల మండలం టీడీపీ అధ్యక్షుడు సుబ్బనాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.