IPL 2026: రియాన్ పరాగ్ కెప్టెన్ కాబట్టే రాజస్థాన్ జట్టులో కొనసాగుతున్నాడని క్రికెట్ దిగ్గజం క్రిష్ శ్రీకాంత్ విమర్శించాడు. ఆయనే కాదు, సర్వత్రా ఇలాంటి విమర్శలే వినిపిస్తున్నాయి. ఇందుకు పరాగ్ ఆటతీరే కారణం. టోర్నీలో RR జైత్రయాత్ర చేస్తున్నా.. సారథిగా పరాగ్ చేసింది 45 పరుగులే. 2019 నుంచి IPL ఆడుతున్నప్పటికీ 2024 సీజన్(573)లో మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది లేదు.