AP: CISF అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న బాలకృష్ణ అనే వ్యక్తిని శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన ఆయన యూనిఫాం ధరించి విమానాశ్రయంలో హల్చల్ చేస్తూ, మ్యాట్రిమోనీ ద్వారా ఏకంగా 67 మంది మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. నిందితుడి నుంచి నకిలీ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.