AP: డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేద్కర్‌ని గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని అనుసరించడం కాదు.. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడం. ఆయన పేరును ఎన్నిసార్లు పలుకుతామన్నది కాదు.. ఆయన విజన్‌ను ఎంత స్థిరంగా ముందుకు తీసుకెళ్తామన్నదే ముఖ్యం’ అని పేర్కొన్నారు.