హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను సింగర్ మంగ్లీ కలిశారు. అడ్వకేట్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు నమోదైన నేపథ్యంలో, ఆమె కూడా సుబ్బారావుపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని తెలిపింది.