SDPT: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చిందని మెదక్ RTA అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రమాద సమయంలో మానవత్వంతో స్పందించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి చేర్పించిన వారికి “మహావీర్” పథకం కింద రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తారని చెప్పారు.