నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఏనుగు లింగారెడ్డి గుండెపోటుతో మంగళవారం మరణించారు. ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, మళ్లీ అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి.