PDPL: నంది మేడారం కోర్టు ఆవరణలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగారెడ్డి, న్యాయవాదులు లక్ష్మీనరసయ్య, రాజేశం, సత్యనారాయణ, సంపత్, అశోక్ రెడ్డి, రజిత, కోర్టు పోలీస్ సంతోష్, ప్రాసెస్ సర్వర్ తేజ పాల్గొన్నారు.