ASF: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షల్లో 468/470 మార్కులతో ప్రతిభ కనబర్చిన కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మార్త శశి వర్ధన్‌ను పద్మశాలి సేవా సంఘం నాయకులు మంగళవారం సన్మానించారు. వారు మాట్లాడుతూ.. శశి వర్ధన్ విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సంఘం సభ్యులు పాల్గొన్నారు.