WGL: వర్ధన్నపేట పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయసాగర్, మున్సిపల్ ఛైర్మన్ సారంగపాణి, కమిషనర్ సుధీర్ కుమార్ పాల్గొన్నారు. కార్మికుల సేవలను కొనియాడుతూ.. వారికి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజ పరిశుభ్రతలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు.