RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్పల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన రన్ ఫర్ నాలెడ్జ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. సింగపురం టవర్ నుంచి శంకర్పల్లి అంబేద్కర్ విగ్రహం వరకు, అంబేద్కర్ అభిమానులు, నాయకులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.