VKB: డాక్టర్ B.R.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, సమసమాజ స్థాపన కోసం పరితపించిన విశ్వమానవుడు అని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు.