GDWL: మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న వీర క్రీడలు గ్రామాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి అని మానవపాడు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మానవపాడు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ ఈదమ్మ అమ్మవారి పండుగ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన ఎద్దుల బండలాగుడు పోటీలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.