TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారికంగా ఉత్సవాలు నిర్వహించకపోవడంపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలన్న అక్కసుతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందని మండిపడ్డారు.