SRD: పోలీస్ శాఖ నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రజలకు ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నేడు నాగలిగిద్ద మండలం ఊట్ పల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో పోలీసులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తామని, తలకు హెల్మెట్ కారులో సీట్ బెల్ట్ ధరిస్తామన్నారు.