VZM: జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో తోటపల్లి బ్యారేజ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పుర
AKP: ఎలమంచిలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో అభ్యుదయ రైతులకు నిర్వహించిన విజ్ఞాన యాత్రలో మామిడి, జీడి తోటల పెంపకం అంటుకట్టు విధానంపై అవగాహన కల్పించినట్లు ఏవో మోహన్ రావు మంగళవారం తెలిపారు. పోలవరం జిల్లా ఉద్యానవన కేంద్రంలో తాటి పండ్ల నీరాపై వ్యవస
KRNL: కౌతాళం గ్రామ పంచాయతీ బండిమెట్ట, కమేళ, దినసరి మార్కెట్లకు ఏప్రిల్ 2న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు MPDO గోపాల్, సర్పంచ్ దినకర్, PS యోగేశ్వర్ తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నగదు డిపాజిట్ చేసి పాల్గొనాలని సూచించారు
అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గ పరిధిలోని సంబేపల్లి మండలంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలకు వి
VSP: వైజాగ్ ఆర్టిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ 2026 సీజన్-6 బ్రోచర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాకారుల ఉత్సాహాన్ని పెంపొందించడానికి ఇటువంటి క్రీడా పోటీల
ASR: అనంతగిరి మండలం జామగూడ వాసుల 78 ఏళ్ల కల నెరవేరింది. మార్దగూడ జంక్షన్ నుంచి కమలాపురం మీదుగా జామగూడ వరకు 3 కి.మీ. బీటీ రోడ్డుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ డా.సియ్యారి దొన్ను దొర శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో ఈ పనులు చేపడుతున్నారు. ‘అడవి తల్లి బాట’
SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు గాను బాలికలకు HPV టీకా పంపిణీ కార్యక్రమాన్ని వైద్యాధికారులు ప్రారంభించారు. 14 నుండి 15 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేశారు. భవిష్యత్తులో మహిళలకు క్యాన్సర్ ము
TPT: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన మంగళవారం వసంతోత్సవ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతలతో స్వామివారికి అభిషేకం చే
PDL: మాచర్ల(మం) కొత్తపల్లిలో మంగళవారం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె 1000 ఎకరాలలో మెగా వస్త్ర పార్కు అభివృద్ధి కోసం ఏపీ ఐసీసీ ఆధీనంలో ఉన్న 477.88 ఎకరాల భూమిని పరిశీలించారు. అనంతరం మిగిలిన 522.12 ఎకరాలకు భూ సేకరణ విషయమై వెల్దుర