WGL: జిల్లాలోని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ భావనను పెంపొందించేందుకు ప్రతిభ పాట పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈనెల 23వ తేదీన జిల్లా పరిపాలన భవన ప్రాంగణంలో విద్యార్థులు స్వయంగా రూపొందించిన క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్తమ ప్రదర్శను ఎంపిక చేసి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తామని తెలిపారు.