KRNL: కోసిగి (మం) చింతకుంట గ్రామానికి చెందిన విద్యార్థి నరసింహులు అదృశ్యమయ్యాడు. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సప్పగారి నరసారెడ్డి, నర్సమ్మ దంపతుల కుమారుడైన నరసింహులు కోసం బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.