MNCL: సమిష్టి కృషితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని దండేపల్లి మండల ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్ సూచించారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై అందరికీ చర్చించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేయాలన్నారు.