NGKL: కొల్లాపూర్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన జగన్ యాదవ్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ప్రతిభ కనబరిచాడు. 470కి 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించాడు. విద్యార్థి ప్రతిభను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రశంసించి సన్మానించారు. గ్రామానికి పేరు తెచ్చినందుకు కుటుంబ సభ్యులు, యువకులు శుభాకాంక్షలు తెలిపారు.