PDPL: అంబేడ్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి సత్కరించారు. మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల కాళ్లు కడిగి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, పట్టణాభివృద్ధిలో వారి సేవలు అమూల్యమని పేర్కొన్నారు.