MNCL: అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా మందమర్రి పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీస్ స్టేషన్, ఎంఆర్వో, మున్సిపల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోల్ బంక్లలో నో హెల్మెట్ – నో ఎంట్రీ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు సీఐ పర్స రమేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించి రావాలని సూచించారు.