MNCL: బెల్లంపల్లి పట్టణ ప్రజలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి గురువారం సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ బర్డ్’ స్కీమ్ ఈ నెల 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. గడువులోగా పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.