BDK: అగ్ని ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా అగ్నిమాపక అధికారి క్రాంతి కుమార్ కోరారు. బుధవారం కొత్తగూడెంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 20 వరకు సాగే ఈ వేడుకల్లో భాగంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వేసవిలో ప్రమాదాలు పొంచి ఉంటాయని, అత్యవసర సమయాల్లో 101 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.