SRCL: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. బుధవారం రోజున జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో బహిరంగంగా మద్యం సేవించిన 61 మందిపై, అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన 55 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.