ATP: పామిడి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు బుధవారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 రోజుల క్రితం గ్రామాలకు నీరును విడుదల చేయాలని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే హంద్రీనీవా కాలువ నుంచి సాగునీరు గ్రామాలకు వచ్చేలా చేయడంతో రైతుల హర్షం వ్యక్తం చేశారు.