NLG: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ ఛైర్మెన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ పదవీ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు హాజరు కావాలని ఆ విభాగం నల్లగొండ జిల్లా ఛైర్మెన్ బోడ స్వామి కోరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గురువారం సాయంత్రం గం.3 లకు జరిగే కార్యక్రమానికి విచ్చేయాలని కోరారు.